ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నెంబర్‌ వన్‌ ర్యాంకు రావడంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యల వల్లే టాప్‌ ర్యాంక్‌ వచ్చిందని ఆయన అన్నారు. కీలకమైన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) రాష్ట్రం తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి శనివారమిక్కడ మాట్లాడుతూ… కరోనా దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం తోడ్పాటునిచ్చారని పేర్కొన్నారు. పరిశ్రమలు మళ్లీ నడిచేలా ఆర్థిక తోడ్పాటు, భరోసాను ముఖ్యమంత్రి కల్పించారని ఆయన అన్నారు. పెట్టుబడిదారులు ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారన్నారు.

Leave A Reply

Exit mobile version