Author: admin
ప్రముఖ మొబైల్ గేమ్ పబ్‌జీ తన భారతీయ యూజర్ల నోటిని తీపి చేసింది. భారతీయ వినియోగదారుల కోసం కొత్త అవతారంలో ఈ గేమ్ని తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇండియా యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త వెర్షన్‌ని ‘పబ్‌జీ మొబైల్ ఇండియా’ పేరుతో త్వరలోనే లాంచ్ చేయనున్నామని పబ్‌జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో సుమారు 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలన్న యోచన లో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి, సురక్షితమైన ఆరోగ్యకరమైన కొత్త వెర్షన్ను వినియోగదారులకు అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పబ్‌జీ కార్పొరేషన్ మాతృ సంస్థ క్రాఫ్టన్ ఇటీవలే మైక్రోసాఫ్ట్‌తో చేయి కలిపింది. అజూర్ క్లౌడ్‌లో యూజర్ డేటా స్టోర్ చేసేలా గ్లోబల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ గత వారమే ప్రకటించింది. అంతేకాదు గేమ్ డెవలప్‌మెంట్, వ్యాపార విస్తరణకు సంబంధించి దేశీయంగా 100 మందికి పైగా ఉద్యోగులను కూడా నియమించుకోనుంది. ‘పబ్‌జీ మొబైల్ …
గ్రేటర్ హైదరాబాద్ నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఈ రోజు ప్రారంభమయింది. దక్షిణ భారతదేశంలోనే చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తొలి ప్లాంట్ ఇదే కావడం గమనార్హం. జవహర్‌నగర్‌లోని ఈ ప్లాంట్ మొదటి దశ పనులు ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభం కాగా, మునిసిపల్ శాఖ అమాత్యులు శ్రీ కె.తారకరామారావు లాంఛనంగా నేడు ప్రారంభోత్సవం చేశారు. కార్మిక శాఖ అమాత్యులు శ్రీ చామకర మల్లారెడ్డి, నగర మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్లాంట్‌లోని రెండు బాయిలర్లకు గాను ప్రస్తుతం ఒకదాని ద్వారా రోజుకు 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఎంఎస్‌డబ్లు్యఎం) ప్రాజెక్ట్‌గా వ్యవహరిస్తున్న దీని ద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్‌టన్నుల ఆర్డీఎఫ్ చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. మలిదశలో మరో…
బ్యాడ్మింటన్ కోర్టులో సత్తా చూపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపారు . ప్రస్తుతం లండన్‌లోని గ్యాటోరెడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ (జీఎస్‌ఎస్‌ఐ)తో కలిసి పనిచేస్తోన్న సింధు ప్రస్తుతం ఆటతోపాటు, మానసికంగానూ శారీరకంగా పూర్తి ఫిట్‌గా ఉన్నానని చెప్పారు. జనవరిలో ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలతో కోర్టులో అడుగుపెడతానన్నారు . ఈ మేరకు సన్నద్ధమవుతున్నానని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో 2021లోనే టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని ముందే ఊహించానని… అందుకు మానసికంగా సన్నద్ధమయ్యానని పేర్కొంది. అందరూ ఊహించుకుంటున్నట్లుగా చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసారు. ఆయనకు సమాచారమిచ్చాకే జీఎస్‌ఎస్‌ఐతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. న్యూట్రిషియన్, ఫిట్‌నెస్‌తో పాటు పలు అంశాలపై గత నాలుగేళ్లుగా జీఎస్‌ఎస్‌ఐ అనుబంధాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. ప్రపంచ మాజీ చాంపియన్స్ నొజోమి ఒకుహారా (జపాన్), కరోలినా మారిన్ (స్పెయిన్)లతో జరిగే మ్యాచ్‌ల్లో తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తానని…
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో ‘డీ’ విటమిన్ నిర్వహించే పాత్రపై తగిన పరిశోధనలు సాగించాల్సిందిగా బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాన్‌కాక్ ఇచ్చిన ఆదేశాల మేరకు క్వీన్ మేరీ యూనివర్శిటీ పరిశోధకులు తాజాగా పరిశోధనలు సాగించారు. ప్రాథమికంగా జరిపిన పరిశోధనల్లో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కండరాలు, ఎముకలు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు “డి” విటమిన్ ఎంతో దోహదపడుతుందని తేలింది. శరీరంలోని కాల్షియం, ఫాస్ఫేట్‌ను క్రమబద్దీకరించడంలో డి విటమిన్ పాత్ర ఆమోగమని పరిశోధకులు తెలిపారు. డి విటమిన్ తక్కువగా ఉండి, చర్మం తీవ్రంగా దెబ్బతిన్న 86 మంది శిశువులకు మూడు నెలల పాటు “డి” విటమిన్ ఇవ్వగా, వారి చర్మం పూర్తిగా మెరగుపడిందని వారు అన్నారు. బ్రిటన్‌లో 50% జనాభా “డి” విటమిన్ కొరతతో బాధ పడుతున్నారు. సహజసిద్ధంగా సూర్య రశ్మితో మానవ శరీరంలో “డి” విటమిన్ అభివృద్ధి చెందుతుంది. అయితే చలికాలంలో ఆ దేశంలో…
ఫుడ్ డెలివరీ సంస్ధ అయిన జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. తద్వారా దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో తొలిసారి లిస్టయిన ఆధునిక ఇంటర్నెట్ వినియోదారు సంస్థగా నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇది వరకు 2019 జూన్ మాసంలో బీటూబీ ఆన్లైన్ కంపెనీ ఇండియామార్ట్ ఇంటర్మెష్ మార్కెట్లో లిస్టయ్యింది. ఇంటర్నెట్ ఆధారిత సేవలందించే ఇతర సంస్థలతో పరిగణిస్తే.. 2006లో ఇన్ఫో ఎడ్జ్, 2013లో జస్ట్ డయల్ పబ్లిక్ ఇష్యూలను విజయవంతంగా ముగించాయి. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్ ఇన్వెస్ట్ చేసిన విషయం అందరికి విదితమే. కాగా.. 2010లో ఆన్ లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్ మై ట్రిప్.. నాస్డాక్ లో లిస్టింగ్ సాధించింది. కోటక్ మహీంద్రా పబ్లిక్ ఇష్యూకి మర్చంట్ బ్యాంకుగా కొటక్ మహీంద్రాను జొమాటో ఎంపిక చేసుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఇష్యూకి న్యాయ సలహాదారులుగా సైరిల్ అమర్చంద్ మంగళ్దాస్, ఇండస్ లా సేవలందించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా..…
కోవిడ్‌కు ముందున్న స్థాయితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో యూపీఐ లావాదేవీలు విలువ, పరిమాణం పరంగా 1.7 రెట్లు అధికమయ్యాయని ఎస్‌బీఐ వెల్లడించింది. అన్‌లాక్ తదనంతరం అయిదు నెలల కాలంలో భారత్‌లో వివిధ రంగాల్లో నెలకొన్న పరిస్థితులపై ఎస్‌బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ రాసిన ఈ నివేదిక ప్రకారం.. సెప్టెంబరు నెలలో ఋణాలు సంఖ్య పెరిగినప్పటికీ అక్టోబరు నెలలో ఆ ఊపును అందుకోలేకపోయింది. రుణాల వృద్ధి రేటు 5.1 శాతంగా నమోదైంది. గతేడాది ఇది 8.9 శాతం. రెండవ త్రైమాసికంలో బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. సూక్ష్మ ఋణ సంస్థలు సైతం మెరుగైన పనితీరు కనబరిచాయి. మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు తగ్గాయి. హామీ లేని ఋణాలు 2020 సెప్టెంబరు నెలతో పోలిస్తే అక్టోబరు నెలలో 48 శాతం తగ్గి, రూ.1.02 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్…
ఐఐటీ మద్రాస్ విద్యార్థులు పిల్లల్లొ అవగాహన పెంచడానికి ఐఐఎమ్ కోవిడ్ గేమ్‌ని రూపొందించారు. ప్రసిద్ధ సూపర్ మరియో గేమ్‌ని ఆదర్శంగా తీసుకుని దీన్ని రూపొందించారు. ఒక నిమిషం పాటు సాగే కోవిడ్-19 ఆటలో గరిష్ట పాయింట్లు సాధించడానికి సరైన పనులు చేయాలి. మీ పిల్లలు కరోనా జాగ్రతలు పాటించడం లేదా? అయితే వారితో ఈ గేమ్ ఆగించండి. గేమ్ ఆడాక మీకే ఎలా భద్రంగా ఉండాలో చెప్తారు. ఈ గేమ్ పన్నెండు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. కోవిడ్-19 పై పిల్లల్లో అవగాహన కల్పించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదొక బ్రౌజర్ బేస్డ్ గేమ్ దీన్ని మోబైల్, టాబ్లెట్, లాప్‌టాప్, పీసీ ఎందులోనైనా డౌన్లోడ్ చేసుకుని ఆడొచ్చు. కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడటానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ గేమ్‌ని రూపొందించారు. ఎక్కువ పాయింట్లు సాధించినవారు విన్నర్. సరైన పనులు అంటే గేమ్‌లోని పాత్రలు సరైన…
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నిక 2020 లో నితీష్ కుమార్ వరుసగా నాల్గవ ఎన్నికల విజయాన్ని కోరుతున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే, నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఐదుసార్లు ప్రమాణం చేశారు – 2015 లో రెండుసార్లు, 2010, 2005, 2000. నితీష్ కుమార్ 1977 లో మొదటిసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. నితీష్ కుమార్ చివరిసారిగా 1985 లో బీహార్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలలో పోటీ చేశారు. అనంతరం నితీశ్ కుమార్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచారు. అతని చివరి లోక్సభ ఎన్నిక 2004 లో. 2005 లో బీహార్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన రాజీనామా చేశారు. 2014-15లో తొమ్మిది నెలల స్వల్ప కాలం మినహా ఆయన నవంబర్ 2005 నుండి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో రాజకీయ విభేదాలపై 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో…
CSK తో శనివారం జరిగిన మ్యాచ్‌లో DC విజయం సాధించింది. 20వ ఓవర్ జడేజా వేసాడు. ఈ ఓవర్ లొ అక్షర్ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పుకున్నాడు. అయితే 20వ ఓవర్ను జడేజా చేతికి ధోని ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. బ్రేవో ఫిట్‌గా లేడు గనుక చివరి ఓవర్‌ను జడేజాకు ఇవ్వాల్సి వచ్చిందని ధోని వివరణ ఇచ్చాడు. మొదత బాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 180 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అంబటి రాయుడు(45 నాటౌట్; 4 సిక్స్‌లు, 1ఫోర్,) రవీంద్ర జడేజా(33 నాటౌట్; 13 బంతుల్లో 4 సిక్స్‌లు), డుప్లెసిస్ (58; 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆపై ఢిల్లీ టార్గెట్ ఛేదించే క్రమంలో ధావన్ (అజేయంగా 101 పరుగులు) జట్టు విజయం సాధించే వరకూ క్రీజ్‌లో ఉండి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన వెలువడింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ బీసీ నేతలు సంబరాలు నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు రజక: రంగన్న (అనంతపురం) కురుబ : కోటి సూర్యప్రకాశ్ బాబు (అనంతపురం) తొగట : గడ్డం సునీత (అనంతపురం) కుంచిటి వక్కలిగ: డా.నళిని(అనంతపురం) వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు) పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు) ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు) ఈడిగ : కె.శాంతి (చిత్తూరు) యాదవ: హరీష్‌కుమార్ (కడప) నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప) పద్మశాలీ: విజయలక్ష్మి (కడప) నూర్ బాషా…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.