Author: admin
ప్రస్తుత ప్రపంచంలో యువతి యువకులు అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం చెప్పుకో అక్కర్లేదు. అయితే వారిని అధిక బరువు అనే సమస్య బాగా వేధిస్తోంది. నాజుగ్గా కనిపించడానికి ఎన్నో రకాల పాట్లు పడుతున్నారు. సహజసిద్ధంగా బరువు తగ్గాలనే అనే ఆలోచనని చాలామందికి పాటించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా తెలుగు ప్రజలు బీరకాయను అప్పుడప్పుడు వినియోగిస్తుంటారు. కానీ బీరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే రోజు బీరకాయను వాడతారు. కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే కాకుండా మరెన్నో ఆరోగ్య సమస్యలకు బీర సంజీవనిగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బరువు తగ్గడానికి ఈ కూరగాయ తింటే ఎన్ని లాభాల్లో తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. సహజంగా బీరకాయలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి కొవ్వును సైతం సులభంగా కరిగించే శక్తి బీరకే సొంతం. బీరను రోజూ తినడం వల్ల…
అవకాశం వచ్చేంతవరకే అవస్థలు. ఒక్కసారి అవకాశం గుమ్మం తట్టి, తదుపరి సక్సెస్ అయ్యామా ఇక గారెల బుట్టలో పడ్డ చందమే. హీరోయిన్ల విషయంలో ఇది ఎన్నోసార్లు ఋజువు అయ్యింది. తాజాగా కన్నడ కథానాయకి రష్మిక మందన్నా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో లక్షల్లోనే పారితోషికం అందుకున్న ఈ భామ టాలీవుడ్‌కు మకాం మార్చాక రేటు అమాంతం పెంచేసింది. తెలుగులో తొలి చిత్రం ‘ఛలో’తో ప్రేక్షకులను తన బుట్టలో వేసుకున్న ఈ భామ, ఆ తర్వాత నటించిన ‘గీతా గోవిందం’ తో బంపర్ హిట్ కొట్టింది. దీంతో బడా నిర్మాతల ఆమె చుట్టూ క్యూ కట్టారు. అలా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందెపుచ్చుకుంది . దీంతో రష్మిక తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే గీతాగోవిందం సక్సెస్ వరకు ఆమె ఒక్క సినిమాకు రూ.50…
టాటా గ్రూప్ ఫౌండర్, పారిశ్రామికవేత్త దిగ్గజం రతన్ టాటా తాజా పెట్టుబడులు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. ఫార్మా స్టార్టప్ కంపెనీలో వ్యక్తిగత స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పెట్టుబడుల వివరాలను ఆయనగోప్యంగా ఉంచారు. ముంబైలోని యువ వ్యవస్థాపకుడు, సీఈవో అర్జున్ దేశ్‌పాండే (18)కు చెందిన ‘జనరిక్ ఆధార్’లో 50 శాతం వాటాను రతన్ టాటా తాజాగా కొనుగోలు చేశారు. సరసమైన ధరలకే అందరికీ ఔషధాలను అందించాలనే బృహత్ ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ముంబైకు చెందిన అర్జున్ దేశ్‌పాండే 2018లో రూ. 15 లక్షల ప్రారంభ నిధులతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. జెనెరిక్ ఆధార్ ఒక ఫార్మసీ-అగ్రిగేటర్. జెనెరిక్ ఔషధాలను తయారీదారు నుండి నేరుగా చిల్లర వ్యాపారులకు అందిస్తుంది. దళారీల దోపిడీని అడ్డుకోవడంతోపాటు ఖర్చును భారీగా తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఫలితంగా మార్కెట్ ధర కంటే 20-30 శాతం తక్కువకే మందులను విక్రయిస్తుంది. ఫార్మసిస్ట్‌లు, ఐటీ ఇంజనీర్లు, మార్కెటింగ్ నిపుణులు సహా…
ఐటీ దిగ్గజ సంస్థ విప్రో అధినేత శ్రీ అజీం ప్రేమ్‌జీ దాతృత్వంలోనూ ముందంజ లో నిల్చారు. రోజుకు సుమారు రూ. 22 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 7,904 కోట్లు విరాళమిచ్చారు. తద్వారా 2019–20 సంవత్సరానికి గాను హురున్ రిపోర్ట్ ఇండియా, ఎడెల్‌గివ్ ఫౌండేషన్ రూపొందించిన దానశీలుర జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్‌జీ రూ. 426 కోట్లు విరాళమిచ్చారు. ఇక తాజా లిస్టులో సుమారు రూ. 795 కోట్ల విరాళంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శ్రీ శివ నాడార్ రెండో స్థానంలో నిలవగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీ ముకేశ్ అంబానీ రూ. 458 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్ రూ. 826 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలతో కార్పొరేట్ల విరాళాలు ఇచ్చే తీరులో కొంత…
స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ తన విజయ పరంపరలో మరో అడుగు ముందుకేశాడు. పారిస్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరడం ద్వారా తన 1000వ విజయాన్ని అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ 4–6, 7–6 (7/5), 6–4తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై గెలుపు బావుటా ఎగుర వేసాడు. తద్వారా ఓపెన్ శకం (1968 తర్వాత)లో వేయి విజయాలు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల కెక్కాడు. నాదల్‌కంటే ముందు ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (1,274), రోజర్ ఫెడరర్ (1,242), ఇవాన్ లెండిల్ (1,068) మాత్రమే ఉన్నారు. 2002 ఏప్రిల్ 29న 16 ఏళ్ల వయసులో రమోన్ డెల్గాడో (పరాగ్వే)పై గెలుపుతో తన విజయాల వేటను ఆరంభించిన నాదల్… 2011లో జరిగిన బార్సిలోనా ఓపెన్ సెమీఫైనల్లో ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా)పై నెగ్గడంతో కెరీర్‌లో 500వ విజయాన్ని…
ఎనిమిది సంవత్సరాల వయసులో ‘అమ్మా, నాకు కంప్యూటర్ కావాలి’ అని అడిగాడు అయాన్. ‘ఈ వయసులో కంప్యూటర్ ఎందుకు నాన్నా….బుద్ధిగా చదువుకోకుండా…’ అని కుంజమ్ చావ్లా అన్నారో లేదో తెలియదు, ఒక ఫైన్‌మార్నింగ్ ఆ ఇంటికి కంప్యూటర్ వచ్చింది. ఆ కంప్యూటరే తన తలరాతని మార్చే అల్లావుద్దీన్ అద్భుతదీపం అవుతుందని అయాన్ ఆ క్షణంలో ఊహించి ఉండడు! రకరకాల వీడియోగేమ్స్ ఆడి విసుగెత్తిన అయాన్ దృష్టి ‘ఎడిటింగ్’పై పడింది. వీడియోలు, మూవీలు ఎడిటింగ్ చేసేవాడు. ఈ క్రమంలోనే టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. ‘వీడియోలు సొంతంగా ఎడిట్ చేయగలుగుతున్నాను. వెబ్‌సైట్లు, సాఫ్ట్‌వేర్, యాప్‌లు క్రియేట్ చేయగలనా?’ అనే ఆలోచన వచ్చింది. ‘ఇది ఎలా చేయాలి?’ ‘అది ఎలా చేయాలి?’ అని ఎవరినైనా అడిగితే– ‘చదువుపై దృష్టి పెట్టుకుండా ఇవన్నీ నీకెందుకు?’ అని బిడియ పడ్డాడు. ఆ భయమే తనకు తాను గురువుగా మారే సాదావాకాశం ఇచ్చింది. టెక్నాలజీకి సంబంధించి రకరకాల పుస్తకాలు కొనుక్కొని…
సాధారణంగా ధనియాల మొక్క 2–3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కానీ ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు గోపాల్ ఆపిల్ తోటలో ధనియాల మొక్క ఏకంగా ఏడు అడుగుల ఒక అంగుళం ఎత్తు పెరిగింది. ఇది గిన్నిస్ రికార్డ్. గతంలో ధనియాల మొక్క 5.9 అడుగుల ఎత్తుగా గిన్నిస్ బుక్‌లో నమోదై ఉంది. కొద్ది కాలం క్రితం గోపాల్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. గోపాల్ దత్ ఉప్రేటి స్వతహాగా సివిల్ ఇంజనీర్. ఢిల్లీలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఆయన ఐరోపా పర్యటనకు వెళ్లినప్పుడు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను తొలిసారి గుర్తించారు. తర్వాత కొన్నేళ్లకు ఉద్యోగానికి రాజీనామ చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం రాణిఖేత్ ప్రాంతంలోని స్వగ్రామం బిల్‌కేష్‌కు తిరిగి వచ్చారు. 2015 నుంచి తనకున్న మూడెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు 8 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఆయన తోటలో 2వేల ఆపిల్ చెట్లున్నాయి.…
ఈ భూమండలం మీద ఇప్పటికీ మానవుల దృష్టికి రాని ప్రకృతి అందచందాలెన్నో ఉన్నాయనే విషయం తెల్సిందే. అలాంటి దృశ్యాలు మానవాళి దృష్టికి అప్పుడప్పుడు రావడం, వాటిని చూసి అచ్చరవొందడం కూడా మనకు అనుభవమే. అందులో కొన్ని అసామాన్యమయినవి అపురూపమైనవిగా ఉంటాయి. అలాంటి కోవకే చెందినది మెక్సికో లోని పశ్చిమ తీరానికి చెందిన మారియెట్ దీవుల్లో దాగిన రహస్య బీచ్. ఇదిపై నుంచి చూస్తే ఓ బిలంలో దాగి ఉన్నట్లు కనిపించడం విశేషం. దీన్ని రహస్య బీచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు మెక్సికో బాంబర్లు బాంబులను దాచేందుకు ఈ దీవిని ఉపయోగించగా, ఆ తర్వాత మెక్సికో ప్రభుత్వం సైనిక్ జోన్‌గా ప్రకటించింది. ఇప్పుడు దాన్ని నేచర్ రిజర్వ్‌గా మార్చడంతో ప్రజలు దీన్ని ప్రత్యక్షంగా వీక్షించే వీలు కుదిరింది. ఇది పుంటా మీటాకు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నప్పటికీ, మొదటి నుంచి సైనిక కార్యకలాపాలకే ఉపయోగించినందున ఈ రహస్య దీవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండిపోయింది.…
చికెన్ అంటే ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా చెప్పండి! చికెన్‌కు యూనివర్సల్ ఫ్యాన్స్ ఉంటారనడం అతిశయోక్తి కాదు. పైగా కరోనా టైంలో ఎంత చికెన్ తింటే అంత రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక చికెన్‌లో వందల రకాల వంటకాలు ఉన్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు. అందులోనూ హోటల్స్, రెస్టారెంట్లలో చికెన్ పేరుతో తయారు చేసే చికెన్ కబాబ్స్, చికెన్ 65, బోన్‌లెస్ చికెన్, చికెన్ కర్రీస్ లాంటి వందల రకాల మెనూ ఐటమ్స్ మన కళ్ల ముందు మెదులుతాయి. వీటికి రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నాం తప్ప అసలు వాటికి ఆ పేరెలా వచ్చిందన్నది ఆలోచించే వారి సంఖ్య బహు తక్కువే ఉంటుంది. చికెన్ పేరు చెబితే చాలు.. మాకు ఇంకేం అవసరం లేదంటూ లొట్టలేసుకుని లాగించేసే ఈ రోజుల్లో నెబ్రాస్కాకు చెందిన ఒక వ్యక్తి మాత్రం బోన్‌లెస్ చికెన్ పేరును మార్చాలంటూ ఏకంగా ఆ దేశానికి…
ఏంజెలీనా జోలీకి పిల్లలంటే ఆరో ప్రాణం. భర్త బ్రాడ్ పిట్ పిల్లల్ని చిన్న మాట అన్నాడని అతడికి విడాకులు ఇచ్చేసింది. ఏంజెలీనాకి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఈ ఆరుగురిలో ముగ్గురు కడుపున పుట్టిన వారు. ముగ్గురు కడుపుకు కట్టుకున్నవారు (అడాప్టెడ్). మాడెక్స్–19 కొ, పాక్స్–16 కొ, జహారా–15 కూ.. దత్తత తీసుకున్న పిల్లలు. షిలా–14 కూ, నాక్స్–12 కొ, వివియన్–12 కూ.. జోలీకి, బ్రాడ్ కీ పుట్టిన వాళ్లు. ఈ చివరి ఇద్దరు పిల్లలు కవలలు. ఈ తల్లీబిడ్డలు ఇప్పుడు లాస్ ఏంజెలిస్‌లోని తమ సొంత లాస్ ఫెలిజ్ భవంతిలో క్వారెంటైన్‌లో ఉంటున్నారు. మాడెక్స్ ఐదు నెలల క్రితమే దక్షిణ కొరియా నుంచి అమెరికా వచ్చేశాడు. అక్కడి యాన్సీ యూనివర్సిటీలో అతడు బయోకెమిస్ట్రీ స్టూడెంట్. ఇప్పుడిక ఆన్‌లైన్ లోనే చదువు కొనసాగిస్తున్నాడు. మిగతా ఐదుగురివీ యూఎస్ చదువులే కనుక అంతా ఒకదేశంలో ఒకేచోట ఉన్నారు. ‘అయామ్ సో లక్కీ..’ అంటారు…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.