ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన వెలువడింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ బీసీ నేతలు సంబరాలు నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు
- రజక: రంగన్న (అనంతపురం)
- కురుబ : కోటి సూర్యప్రకాశ్ బాబు (అనంతపురం)
- తొగట : గడ్డం సునీత (అనంతపురం)
- కుంచిటి వక్కలిగ: డా.నళిని(అనంతపురం)
- వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు)
- పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు)
- ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు)
- ఈడిగ : కె.శాంతి (చిత్తూరు)
- యాదవ: హరీష్‌కుమార్ (కడప)
- నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప)
- పద్మశాలీ: విజయలక్ష్మి (కడప)
- నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్‌బి (కడప)
- సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప)
- వాల్మీకి బోయ: డా.మధుసూదన్ (కర్నూలు)
- కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు)
- వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు)
- బెస్త : తెలుగు సుధారాణి (కర్నూలు)
- సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (ప.గో)
- శెట్టి బలిజ: తమ్మయ్య (ప.గో)
- అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న (ప.గో)
- అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్ రావు (ప.గో)
- గాండ్ల : భవానీ ప్రియ (తూ.గో)
- పెరిక : పురుషోత్తం గంగాభవానీ (తూ.గో)
- అగ్నికుల క్షత్రియ: బందన హరి (తూ.గో)
- అయ్యారక: రాజేశ్వరం (తూ.గో)
- షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు)
- వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు)
- కుమ్మరి శాలివాహన: పురుషోత్తం(గుంటూరు)
- కృష్ణ బలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు)
- విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా)
- గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా)
- వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా)
- భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా)
- ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు)
- జంగం: ప్రసన్న (నెల్లూరు)
- బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు)
- ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు)
- చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్‌కుమార్ (ప్రకాశం)
- ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి(ప్రకాశం)
- దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం)
- మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం)
- కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం)
- కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం)
- రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం)
- పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం)
- కురకుల/పొండర: రాజపు హైమావతి(శ్రీకాకుళం)
- శ్రీసైన: చీపురు రాణి( శ్రీకాకుళం)
- మత్స్యకార : కోలా గురువులు (విశాఖ)
- గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ)
- నగరాల: పిల్లా సుజాత (విశాఖ)
- యాత: పి.సుజాత (విశాఖ)
- నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)
- తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం)
- కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు(విజయనగరం)
- శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం)
- దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం)